మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Surya Ashtottara Shatanama Stotram 1 – శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం
అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే |
అసమానబలాయాఽఽర్తరక్షకాయ నమో నమః || 1 ||
ఆదిత్యాయాఽఽదిభూతాయ అఖిలాగమవేదినే |
అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || 2 ||
ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే |
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || 3 ||
ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే |
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || 4 ||
ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే |
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || 5 ||
ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ |
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || 6 ||
ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ |
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || 7 ||
ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే |
ౠక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || 8 ||
లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ |
కనత్కనకభూషాయ ఖద్యోతాయ నమో నమః || 9 ||
లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే |
అపవర్గప్రదాయాఽఽర్తశరణ్యాయ నమో నమః || 10 ||
ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే |
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || 11 ||
ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే |
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || 12 ||
ఓజస్కరాయ జయినే జగదానందహేతవే |
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః || 13 ||
[పాఠభేదః – ఔన్నత్యపదసంచారరథస్థాయాఽఽత్మరూపిణే | *]
ఔచ్చ్యస్థానసమారూఢరథస్థాయాఽసురారయే |
కమనీయకరాయాఽబ్జవల్లభాయ నమో నమః || 14 ||
అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాఽఽత్మరూపిణే |
అచ్యుతాయాఽమరేశాయ పరస్మై జ్యోతిషే నమః || 15 || [సురేశాయ]
అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే |
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాం పతయే నమః || 16 ||
ఓం నమో భాస్కరాయాఽఽదిమధ్యాంతరహితాయ చ |
సౌఖ్యప్రదాయ సకలజగతాం పతయే నమః || 17 ||
నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ |
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః || 18 ||
ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ |
ఓం ఐం ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ నమో నమః || 19 ||
శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే |
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః || 20 ||
ఇత్యథర్వణరహస్యే శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.